ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amazon: విక్రేతలకు రిఫరల్‌ ఫీజు ఎత్తివేత

ABN, Publish Date - May 03 , 2025 | 05:10 AM

అమెజాన్‌ ఇండియా 300 లోపు ఉన్న ఉత్పత్తులకు రిఫరల్‌ ఫీజును ఎత్తివేసింది. ఇది 135 కేటగిరీల ఉత్పత్తులకు వర్తిస్తుండగా, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచే నిర్ణయమని పేర్కొంది.

  • అమెజాన్‌ ఇండియా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చిన్న వ్యాపారులకు మరింత తోడ్పాటునందించేందుకు గాను రిఫరల్‌ ఫీజును ఎత్తివేసినట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. రూ.300లోపు ఉన్న అన్ని ఉత్పత్తులకు ఇది వర్తిస్తుందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ సేల్స్‌ గౌరవ్‌ భట్నాగర్‌ తెలిపారు. 135 ఉత్పత్తుల కేటగిరీలోని వాటికి ఈ జీరో రిఫరల్‌ ఫీజు అమలవుతుందన్నారు. దీని ద్వారా కొనుగోలుదారులకు మరింత తక్కువ ధరకే ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. అపారెల్స్‌, ఫ్యాషన్‌ జువెలరీ, కిరాణా సహా పలు ఉత్పత్తులు ఈ కేటగిరిలో ఉన్నాయని భట్నాగర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 7 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అమెజాన్‌ ద్వారా పలు ఉత్పత్తులు విక్రయిస్తున్న 50 వేలకు పైగా విక్రేతలకు ఇది ఎంతగానో లబ్ది చేకూరుస్తుందన్నారు. హైదరాబాద్‌ సహా సమీప నగరాల్లోని విక్రేతలు అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా హోమ్‌ అండ్‌ కిచెన్‌, ఫర్నీచర్‌, స్పోర్ట్స్‌ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 05:11 AM