Vinayaka Nimajjanam 2025: వ్యాపారంలో పురోగతి సాధించడానికి గణేశ్ నిమజ్జనంలో ఈ చిన్న పరిహారం చేయండి.!
ABN, Publish Date - Sep 06 , 2025 | 12:14 PM
ఈరోజు గణేశ్ నిమజ్జనం. అయితే, ఈ రోజున ఒక చిన్న పరిహారం చేస్తే ఏడాది పొడవునా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, వాణిజ్యం వృద్ధి చెందుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. పదకొండు రోజుల పాటు ఎంతో భక్తితో బప్పాను పూజించిన భక్తులు నిమజ్జన సమయంలోనూ అంతే భక్తితో సందడి చేస్తూ వైభవంగా వీడ్కోలు చెబుతున్నారు. అయితే, జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిమజ్జనం రోజున చిన్న పరిహారాలు పాటిస్తే, సంవత్సరమంతా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, ఆర్థికంగా వృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి, ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాపార అభివృద్ధికి పరిహారాలు:
గణేశుడిని నిమజ్జనం చేసిన తర్వాత, ఒక ఆవు దగ్గరికి వెళ్లి స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం తినిపించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న పరిహారం వ్యాపారంలో లాభాలను తెస్తుందని భావిస్తున్నారు.
దూర్వా, తమలపాకుతో నాణెం పరిహారం:
గణేశుడి పూజలో వాడిన దూర్వా గడ్డి, తమలపాకులను కొంచెం నీటిలో నానబెట్టి పెట్టుకోవాలని, తర్వాత పూజలో ఉపయోగించిన ఒక నాణెం తీసుకొని, ఈ ఆకులతో పాటు ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బులు నిల్వ చేసే చోట ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ దానిని భక్తితో పూజిస్తే వ్యాపార అభివృద్ధి చెందుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
కుంకుమ పెట్టడం:
ఇంట్లో గణేశుడిని ప్రతిష్టించిన చోట నుండి విగ్రహాన్ని తీసిన తరువాత, అక్కడ కుంకుమతో 21 చుక్కలు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూల ఫలితాలను ఆహ్వానిస్తుందని అంటారు. అలాగే, గణేశుడిని నిమజ్జనం చేస్తున్న సమయంలో ఓం నమో సిద్ధి వినాయకాయ అనే మంత్రాన్ని జపించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది వ్యాపార అడ్డంకులు తొలగించి శుభఫలితాలను అందిస్తుందని అంటున్నారు. ఈ చిన్న పరిహారాల ద్వారా మీ వ్యాపారంలో మరింత విజయాన్ని సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర
రూ. 2.32 కోట్లు పలికిన రాజేంద్రనగర్ గణేశ్ లడ్డూ.!
For More Latest News
Updated Date - Sep 06 , 2025 | 12:14 PM