ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali 2025 Yama Deepam: యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

ABN, Publish Date - Oct 17 , 2025 | 03:37 PM

ధన త్రయోదశి రోజు హిందువులు తప్పనిసరిగా యముడికి దీపం వెలిగిస్తారు. అందుకే, దీన్ని యమ త్రయోదశి అని కూడా అంటారు. అయితే, యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటో మీకు తెలుసా?

Diwali 2025 Yama Deepam

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగను హిందువులు ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తొలి రోజున ధన త్రయోదశిని అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు జరుపుకొంటారు. ఈ రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనడం చాలా మంచిదని అంటారు. అంతేకాకుండా, ధన త్రయోదశి రోజున అందరూ తప్పనిసరిగా యముడికి దీపం వెలిగిస్తారు. అందుకే, దీనిని యమ త్రయోదశి అని కూడా పిలుస్తారు. యమ దీపం వెలిగించడం చాలా ప్రయోజనాలు ఉన్నాయని కూడా అంటారు. అయితే, యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటి? ఏ దిశలో దీపం వెలిగించాలి? దీన్ని వల్ల ఏలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?

యమ దీపం అనేది ధన త్రయోదశి రోజున యముడికి వెలిగించే దీపం. యమ దీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు. అలాగే, ఇంట్లో అనారోగ్య సమస్యలున్న వారు ఉపశమనం పొందుతారని నమ్మకం. అంతేకాకుండా, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని కూడా భావిస్తారు. ఈ రోజున యముడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు దీపం వెలిగించి ఆశీస్సులు పొందుతారు. యమ దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణ భయం ఉండదని, సంవత్సరం పొడవునా వారికి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

ఏ దిశలో దీపం వెలిగించాలి?

ధన త్రయోదశి రోజున దక్షిణ దిశలో యమదీపం వెలిగించాలి. సాధారణంగా ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో నాలుగు వత్తులు వేసి నాలుగు ముఖాల దీపాన్ని వెలిగిస్తారు. కొన్ని చోట్ల గోధుమ పిండితో తయారుచేసిన దీపాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇంటి బయట, దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

(Note: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధార పడి ఉంటుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

ఇవి కూడా చదవండి...

భార్యపై కోపం.. అత్తింటిని తగలబెట్టిన భర్త.. ఏమైందంటే?

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 03:43 PM