Share News

Fire Accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

ABN , Publish Date - Oct 17 , 2025 | 07:19 AM

హైదరాబాద్‌లో రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని పేట్ బషీరాబాద్‌లోని ధూలపల్లి చైనా బజార్‌లో ప్లాస్టిక్ కవర్లను తయారు చేసే పాలిమర్స్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది.

Fire Accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Fire Accident

హైదరాబాద్‌లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని పేట్ బషీరాబాద్‌లోని ధూలపల్లి చైనా బజార్‌లో ప్లాస్టిక్ కవర్లను తయారు చేసే పాలిమర్స్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కావడం వల్ల మంటలు వేగంగా కంపెనీ మొత్తం వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Oct 17 , 2025 | 08:03 AM