Asifabad: భార్యపై కోపం.. అత్తింటిని తగలబెట్టిన భర్త.. ఏమైందంటే?
ABN , Publish Date - Oct 17 , 2025 | 09:24 AM
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో భార్యపై కోపంతో అత్తింటికి నిప్పు పెట్టిన ఘటన జరిగింది. జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో ఎల్లాపాటార్‌కు చెందిన షమాబీకి 9 నెలల కిందట పెళ్లి అయింది.
ఆసిఫాబాద్, అక్టోబర్ 17: ఈ మధ్య భార్యా భర్త మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భార్యాభర్తలు ఒకరికి ఒకరు దూరం అవుతున్నారు. చిన్నచిన్న గొడవలు, మనస్పర్ధలుగా మారి తీవ్ర ఘర్షణకు దారితీస్తుంది. ఎవరికివారు తాడోపేడో తేల్చుకొని దూరం అవుతుంది. కొందరు గొడవలు పెట్టుకొని దూరం అవుతుంటే.. మరికొందరు ఏకంగా ప్రాణాలే తెస్తున్నారు. కొత్త కొత్త స్ట్రాటజీలు వేస్తూ దారుణ హత్యలు చేస్తున్నారు. యూట్యూబ్ లో చూసి మరీ హత్యలకు ప్లాన్ చేస్తున్నారు. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఇటీవల ఘటనలు జరుగుతున్నవిషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో భార్యపై కోపంతో అత్తింటికి నిప్పు పెట్టిన ఘటన జరిగింది. జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో ఎల్లాపాటార్‌కు చెందిన షమాబీకి 9 నెలల కిందట పెళ్లి అయింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో ఎప్పుడూ ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజున జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారగా 20 రోజుల కిందట షమాబీ పుట్టింటికి వెళ్లింది.
దీంతో గురువారం ఎల్లాపాటార్‌కు వచ్చిన అతడు భార్యతో గొడవకు దిగాడు. మాటా మాటా పెరగటంతో భర్త కోపానికి అవధులు లేకుండా పోయాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న అతడు.. ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ పైపు లీక్ చేసి నిప్పంటించి అక్కడినుంచి జంప్ అయ్యాడు. మంటల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగన్న వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Fire Accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
TGSRTC: దీపావళి పండగ ఎఫెక్ట్.. పేలుతున్న టికెట్ ధరలు