Astrology Tips: ఈ పొరపాటు భార్యాభర్తల మధ్య తగాదాలను పెంచుతుంది.!
ABN, Publish Date - Jul 10 , 2025 | 01:37 PM
కొన్నిసార్లు మన సాధారణ అలవాట్లు ఎంత చిన్నవైనా, మన జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ సంస్కృతిలో పెళ్లయిన స్త్రీలు నుదిటిపై బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయం. దీనిని 'బిందీ' అని కూడా అంటారు. ఇది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది స్త్రీల సౌభాగ్యం, అదృష్టం, పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు.
బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది భర్త ఆయుష్షు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల శాంతి, ఏకాగ్రత లభిస్తాయని కూడా నమ్ముతారు. అయితే, బొట్టుకు సంబంధించిన చిన్న నిర్లక్ష్యం మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా? అవును, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలా మంది మహిళలు బొట్టు ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా ఈ చిన్న పొరపాటు చేస్తారు. ఇది వారి వైవాహిక జీవితంలో ఉద్రిక్తతను కలిగిస్తుంది.
జ్యోతిష్యులు ఏమంటున్నారు?
చాలా మంది మహిళలు స్నానం చేయడానికి ముందు లేదా నిద్రపోవడానికి ముందు నుదిటిపై ఉన్న బొట్టును తీసి బాత్రూమ్ గోడ లేదా అద్దంపై అతికిస్తారు. అయితే, ఈ అలవాటు సాధారణమైనదేనని అనిపించినా ఆధ్యాత్మిక కోణం నుండి ఇది చాలా అశుభకరమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. బొట్టును బాత్రూమ్ గోడ లేదా అద్దం వంటి అపరిశుభ్రమైన, అపవిత్రమైన ప్రదేశంలో ఉంచడం చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఈ అలవాటు ఉన్న స్త్రీలు క్రమంగా తమ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తగాదాలు పెరుగుతాయని, సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడవచ్చని, భర్త పనికి ఆటంకం కలుగవచ్చని అంటున్నారు. అంతేకాకుండా భర్త ఆరోగ్యం, జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఏం చేయాలి?
బొట్టును ఎప్పుడూ కూడా బాత్రూమ్ గోడకు లేదా అద్దంపై అతికించకూడదని చెబుతున్నారు. అలా చేయడం అపవిత్రం మాత్రమే కాకుండా అది మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బొట్టు కన్నా కూడా తిలకం పెట్టుకోవడం ఉత్తమం.
Also Read:
గురు పౌర్ణమి.. ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!
For More Lifestyle News
Updated Date - Jul 10 , 2025 | 03:19 PM