ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mangalagiri Court: వైసీపీ నేత నందిగంకు 14 రోజుల రిమాండ్‌

ABN, Publish Date - May 20 , 2025 | 05:07 AM

టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలో మరియమ్మ హత్య, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుల్లోనూ ఆయన అరెస్ట్‌య్యారు.

  • టీడీపీ కార్యకర్తపై దాడి కేసు

మంగళగిరి సిటీ, మే 19(ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై నందిగం సురేశ్‌ శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో సురేశ్‌ను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు, సోమవారం మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి జూన్‌ రెండో తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలిచ్చారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నందిగం సురేశ్‌ను గుంటూరు జైలుకు తరలించారు. సురేశ్‌పై బీఎన్‌ఎ్‌స చట్టం ప్రకారం 141 (1), 127 (2), 109 (1), 351 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్టు వెల్లడించారు. నందింగంపై ఇప్పటికే 12 కేసులు ఉన్నాయి. మరియమ్మ అనే మహిళ హత్య కేసు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు.

Updated Date - May 20 , 2025 | 05:07 AM