ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: బీజేపీ నేతలే కౌరవులు

ABN, Publish Date - May 06 , 2025 | 05:13 AM

బీజేపీతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ, మద్దతు ధరపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు.

  • నేను గాంధారిని కాదు

  • మద్దతు ధరపై రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

  • రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లేదు: షర్మిల

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ‘కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగమూ లేదు. కాదు, ఉపయోగపడిందని ఆ పార్టీ నేతలు నిరూపిస్తే నేను గాంధారినని ఒప్పుకుంటా’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. విజయవాడలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నేను గాంఽధారిని కాదు... బీజేపీ నేతలే కౌరవులు అంటూ ఆమె ఎదురు దాడి చేశారు. ‘మద్దతు ధరపై కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. అకాల వర్షాల వల్ల పంట, ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యమే కనిపిస్తోంది. రాలిపోయిన మామిడి, కూలిన అరటి చెట్లు పొలాల్లో కనిపిస్తున్నాయి. దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈసారి దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం పండింది. కూటమి ప్రభుత్వం 13 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. రైతు సేవా కేంద్రాలను ప్రభుత్వం బొందపెట్టింది. మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ఏ పంటకూ ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదు’ అంటూ ఉదాహరణల సహితంగా షర్మిల విమర్శ చేశారు. ధరల స్థిరీకరణకు రూ.6,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 06 , 2025 | 05:15 AM