YCP Balinagireddy: మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:20 AM
కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు...
టీడీపీ నేతల వీపు విమానం మోతే.. :ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం, జూలై 9(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయం నియోజకవర్గం రాంపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన వైసీపీ నియోజకవర్గ విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నన్ను నాలుగుసార్లు గెలిపించారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. ఐదోసారి గెలిచి మంత్రిగా మీ ముందుకు వస్తా. అప్పుడు టీడీపీ కార్యకర్తలు, నాయకుల వీపు విమానం మోత మోగిస్తాం. ఎవరు ఏమేం చేస్తున్నారో అవన్నీ బుక్‌లో నోట్ చేసుకుంటున్నా. టీడీపీ నేతలు పెట్టే కేసులకు ఎవరూ భయపడొద్దు. కేసులకు అయ్యే ఖర్చు నేనే భరిస్తా. ఇప్పుడు ఎవరైతే పోలీసులు కేసు పెట్టారో... ఆ పోలీసులతో నా నియోజకవర్గంలో పని చేయించుకుంటూ టీడీపీ వాళ్లపై కేసులు నమోదు చేయిస్తా’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుంది. మూడు రంగుల వైసీపీ కండువాతో ప్రభుత్వ కార్యాలయాలకు మన కార్యకర్తలు వెళ్తే బ్రూ కాఫీ ఇచ్చి కూర్చోబెడతారు’ అని వ్యాఖ్యానించారు.
Updated Date - Jul 10 , 2025 | 03:20 AM