Jagan Convoy: సింగయ్య మృతి.. రంగంలోకి వైసీపీ నేత
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:08 PM
పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తూ వైఎస్ జగన్ కారు కింద పడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత రంగంలోకి దిగి గుంటూరు జిల్లా పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
అమరావతి, జూన్ 24: రెంటపాళ్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లే క్రమంలో వృద్ధుడు సింగయ్య మృతికి సంబంధించిన ఘటనపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై గుంటూరు జిల్లా పోలీసులకు వైసీపీ నేత తలశిల రఘురాం ఫోన్ చేశారని.. ఆయన ఆదేశాలను పోలీసులు గుడ్డిగా పాటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తలశిల రఘురాం ఎవరికి ఫోన్ చేశారనే అంశంపై చర్చ అయితే జరుగుతోంది.
జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వైఎస్ జగన్ వచ్చారు. ఆ క్రమంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించగా.. ట్రాఫిక్‌లో ఇరుక్కుని టీడీపీ కార్యకర్త మరణించారు. కానీ ఏటుకూరు బైపాస్ రోడ్డులో వైఎస్ జగన్ కారు కింద పడి వృద్ధుడు సింగయ్య మరణించారు. ఈ ఘటన తీవ్ర రాద్దాంతంగా మారింది. ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో పోలీసుల వ్యవహరించిన తీరు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందిన ఘటనపై పోలీసులు తొలుత దర్యాప్తు చేపట్టారు. అందులో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి చెందాడంటూ వార్త కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ తర్వాత సీసీ ఫుటేజ్‌లను దర్యాప్తులో భాగంగా పోలీసులు నిశితంగా పరిశీలించారు దీంతో సింగయ్య.. వైఎస్ జగన్ కారు కింద పడి మరణించినట్లు గుర్తించారు. దీంతో జగన్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ రమణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా రమణారెడ్డి.. ఏ2గా వైఎస్ జగన్.. ఏ3గా వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు యజమానిపై పేర్లు చేర్చారు.
మరోవైపు సింగయ్యను ఒక ప్రైవేట్ వాహనం ఢీ కొట్టి మరణించారంటూ జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అందులో గుర్తు తెలియని వాహనం ఢీ కోవడంతో సింగయ్య మృతి చెందినట్లు అందులో పేర్కొనడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
48 విమాన సర్వీసులు రద్దు.. ఎందుకంటే..
For More Andhrapradesh News and Telugu News
Updated Date - Jun 24 , 2025 | 12:56 PM