ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Krishnam raju: తుళ్లూరు పోలీసుల కస్టడీలోకి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు..

ABN, Publish Date - Jun 20 , 2025 | 02:18 PM

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ వీవీఆర్‌ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Journalist VVR Krishnam Raju

VV Krishnam Raju Arrest: రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేసిన సీనియర్ పాత్రికేయుడు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జూన్‌ 11న అరెస్టైన ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మూడు రోజుల విచారణ కోసం తుళ్లూరు పీఎస్‌కు తరలించారు.

మంగళగిరి న్యాయస్థానం గురువారం ఇచ్చిన ప్రకారం, కృష్ణంరాజును 3 రోజుల పాటు తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ మొత్తం మూడు రోజుల పాటు పోలీసులు జర్నలిస్ట్ కృష్ణంరాజును విచారించనున్నారు. ఇలాంటి అమానుష వ్యాఖ్యలు చేసేలా ప్రేరేపించిందెవరు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి.

తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

వారిని ఓ కంట కనిపెట్టండి: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం..

Read Latest Andhra News and National News

Updated Date - Jun 20 , 2025 | 02:41 PM