TDP Leaders: టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే
ABN, Publish Date - May 06 , 2025 | 02:32 PM
TDP Leaders: తెలుగుదేశం పార్టీ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన సందర్భంగా నేతలు భీమిలికి వెళ్లారు. శంకుస్థాపన అనంతరం అనుకోని ఘటన చోటు చేసుకుంది.
విశాఖపట్నం, మే 6 : విశాఖలోని (Visakhapatnam) భీమిలిలో టీడీపీ నేతలకు (TDP Leaders) పెను ప్రమాదం తప్పింది. భీమిలి పరిధిలోని పద్మనాభంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు హాజరయ్యారు. దీంతో సందడి వాతావరణ నెలకొంది. శంకుస్థాపన పూర్తి అయిన తర్వాత జరిగిన పరిణామంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. స్టేజ్ వద్ద జరిగిన హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas), ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao), ఛైర్మన్ శివశంకర్ పాల్గొన్నారు. అంతా కలిసి శంకుస్థాపన పూర్తి చేశారు. కానీ ఇంతలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది. శంకుస్థాపన సమయంలో స్టేజ్ కూలింది. దీంతో స్టేజ్‌పై ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన అనంతరం నేతలందరూ కూడా ఒకేసారి స్టేజ్ ముందుకు వచ్చేశారు.
India Pak War: దేశంలో యుద్ద వాతావరణం.. క్యాటగిరీ 2లో విశాఖ, హైదరాబాద్
అయితే సామర్జానికి మించి నేతలు అంతా స్టేజ్ పైకి వచ్చేయడంతో కుప్పకూలింది. ప్రమాద సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఛైర్మన్ శివశంకర్ స్టేజ్‌పైనే ఉన్నారు. అయితే వీరు ఉన్న ప్రాంతంలో కాకుండా చివరలో స్టేజ్ కూలింది. వెంటనే అప్రమత్తమైన నేతలు అంతా స్టేజ్ నుంచి కిందకు దిగేశారు. టీడీపీ నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఉన్న సమయంలో స్టేజ్ కూలిన వార్త సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
Somireddy Vs Sajjala: సజ్జల నోరెందుకు మూగబోయిందో
Jupally On Miss World Event: మిస్ వరల్డ్ పోటీలు ఇందుకోసమే అన్న మంత్రి
Read Latest AP News And Telugu News
Updated Date - May 06 , 2025 | 03:38 PM