ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bomb Threat: వరుస బాంబు బెదిరింపు కాల్స్.. ఉలిక్కిపడ్డ నగరాలు

ABN, Publish Date - May 24 , 2025 | 03:41 PM

Bomb Threat: ఏపీలోని విశాఖ, విజయవాడ రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టినట్లుగా కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Bomb Threat

విశాఖపట్నం, మే 24: వరుస బాంబు బెదిరింపు కాల్స్‌తో ఇటు విజయవాడ అటు విశాఖ నగరాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకుల ఫోన్‌ కాల్స్‌తో బాంబు స్క్వాడ్, పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈరోజు (శనివారం) ఉదయం విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టామని, ఆ తరువాత రైల్వేస్టేషన్‌‌కు బాంబు బెదరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించారు. తాజాగా విశాఖ రైల్వేస్టేషన్‌లోనూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది.


విశాఖ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తనిఖీలు చేశారు. ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉన్నట్లు ఆగంతకుడి నుంచి ఫోన్‌ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎల్టీటీ చివరి స్టాప్ విశాఖ రైల్వే స్టేషన్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైలు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్‌ 2 బోగీలో అనుమానిత బ్యాగ్‌ను గుర్తించారు. ఆ బ్యాగ్‌‌ను కూడా సెర్చ్ చేయగా బట్టలు మాత్రమే కనిపించాయి. దీంతో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. ఈ ఆపరేషన్‌లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, సివిల్ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ బృందాలు కలిసి ట్రైన్‌ను మొత్తాన్ని పరిశీలించారు. ప్రయాణికుల బ్యాగులను కూడా తనిఖీ చేశారు. చివరకు బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. చాలా రష్‌గా ఉన్న ట్రెయిన్‌లో ఇలాంటి కాల్‌ రావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే బ్యాగును మరిచిపోయిన వ్యక్తి యూపీకి చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. అలాగే ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు దృష్టిసారించారు.


కాగా.. విజయవాడలో రెండు చోట్ల బాంబులు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున కంట్రోల్‌ రూంకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టినట్లు చెప్పి కట్ చేశాడు. బీసెంట్ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. వందలాది మంది వ్యాపారాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టామంటూ కాల్ వచ్చిన వెంటనే పోలీసులు అలర్ట్ అయి బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి నాలుగు బృందాలుగా ఏర్పడి అర కిలో మీటర్ వరకు తనిఖీలు చేశారు. ప్రతీ షాపుతో పాటు తోపుడబండ్లను జల్లెడపట్టారు. ఎక్కడా కూడా బాంబు ఉన్న జాడ కనిపించలేదు. దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత బాంబు లేదని, ఎటువంటి భయం లేకుండా అందరూ వ్యాపారాలు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. దీంతో 11 గంటల తర్వాత బీసెంట్‌ రోడ్డులో వ్యాపార కార్యక్రమాలు మొదలయ్యాయి.


బీసెంట్‌ రోడ్డులో బాంబు లేదని అంతా ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కాల్ కలకలం రేపింది. వెంటనే జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు, విజయవాడ పోలీసులు బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలను బాంబు స్క్వాడ్‌తో అణువణువునా గాలించారు. చివరకు పార్సిల్ ఆఫీస్‌కు వెళ్లి పరిశీలించినప్పటికీ ఎక్కడా బాంబు ఉన్నట్లు ఆనవాళ్లు లేవని పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగా కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు కాల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ఆ ఇద్దరి మృతదేహాలు అప్పగించండి.. హైకోర్టులో పిటిషన్

స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్‌లో ప్రశంసల వర్షం

Read latest AP News And Telugu News

Updated Date - May 24 , 2025 | 04:40 PM