YS Sharmila: తొలగించిన ఉక్కు కార్మికులను తక్షణమే తీసుకోవాలి
ABN, Publish Date - May 20 , 2025 | 04:42 AM
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించిన 2,000 కాంట్రాక్టు కార్మికులను 24 గంటల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లేదంటే 21 నుండి ఆమరణ దీక్షకు దిగే వీలున్నట్లు హెచ్చరించారు.
లేకుంటే రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగుతా: షర్మిల
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విధుల నుంచి తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను 24 గంటల్లోగా విధుల్లోకి తీసుకోవాలి. లేకుంటే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా 21 నుంచి ఆమరణ దీక్షకు దిగుతా’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అల్టిమేటమ్ ఇచ్చారు. ‘ఇప్పటికే రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం... మరో 3,000 మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలి. లేకుంటే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా 21 నుంచి స్టీల్ ప్లాంట్ బయటే ‘ఆమరణ దీక్ష’కు దిగుతాం’ అని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - May 20 , 2025 | 04:43 AM