YCP Jagan: జగన్ వాహనానికి ఫిట్‌నెస్ పరీక్షలు
ABN, Publish Date - Jun 28 , 2025 | 03:04 AM
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి కారణమైన జగన్ వాహనానికి రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ పరీక్షలు చేశారు.
క్షుణ్నంగా తనిఖీ చేసిన రవాణా అధికారులు
గుంటూరు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్త సింగయ్య మృతికి కారణమైన జగన్ వాహనానికి రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ పరీక్షలు చేశారు. మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న జగన్ కారు(ఏపీ 40 డిహెచ్ 2349)ను అధికారులు తనిఖీ చేశారు. వాహన బీమా, బ్రేకులు, హారన్, చాసిస్, ఇంజన్ నంబర్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ నెల 18న రెంటపాళ్లకు వెళ్తున్న సమయంలో సింగయ్యను జగన్ కారు ఢీ కొట్టింది. గాయపడిన సింగయ్య కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాడేపల్లిలోని జగన్ నివాసంలో కారును సీజ్ చేశారు. సింగయ్యను జగన్ కారు ఢీ కొట్టిన ఘటనకు సంబందించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
Updated Date - Jun 28 , 2025 | 03:04 AM