ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టికెట్ల వ్యాపారం పోవడంతో రోజాకు పిచ్చెక్కింది: బొలిశెట్టి

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:44 AM

వైసీపీ నేత రోజా టిటిడి టికెట్ల వ్యాపారం వల్ల లాభపడినట్లు, ఇప్పుడు ఆ వ్యాపారం పోవడంతో ఆమె ఆగ్రహంగా మాట్లాడుతున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్య ఆరోపించారు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకురాలు రోజా మంత్రిగా పనిచేసినప్పుడు టీటీడీ దర్శనాల టికెట్లను సినిమా టికెట్లలా అమ్ముకొని లాభపడ్డారు. ఇప్పుడు ఆ వ్యాపారం పోవడంతో పిచ్చెక్కినట్టు ఏవేవో మాట్లాడుతున్నారు’ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ఆరోపించారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజా గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉందన్నారు. జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ని విమర్శించే హక్కు రోజాకు లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ఆమె వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.

Updated Date - Apr 19 , 2025 | 04:47 AM