Tirupati: ఐదంతస్తుల భవనంపై నుంచి పడి ముగ్గురు తాపీ మేస్త్రీల దుర్మరణం
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:52 AM
తిరుపతిలో ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడిన ముగ్గురు తాపీ మేస్త్రీలు మృతిచెందిన దారుణ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు బావ-బావమరిది కాగా, సంఘటన స్థానంలోనే ప్రాణాలు కోల్పోయారు
మృతుల్లో బావబావమరిది.. తిరుపతిలో విషాదం
తిరుపతి అర్బన్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి పడి ముగ్గురు తాపీ మేస్త్రీలు మంగళవారం దుర్మరణం చెందారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఆండాలయ్య.. మంగళం తుడా క్వార్టర్స్‌లోని హెచ్‌ఐజీలో నిర్మిస్తున్న భవనానికి ప్లాస్టింగ్ పనులు మంగళవారం మొదలుపెట్టారు. కొయ్యల సారవపై నిలబడి గోడకు ప్లాస్టింగ్ చేస్తుండగా ఉదయం 10.40 గంటల సమయంలో అడ్డసారవ కట్టిన కొయ్యల తాడు ఊడిపోయింది. దీంతో వాటిపై నిలబడిఉన్న పెళ్లకూరు మండలం అక్కగారిపేటకు చెందిన బి.శ్రీనివాసులు, ఒంగోలుకు చెందిన కె.శ్రీనివాసులు, టి.వసంత్ (బావమరదులైన వీరిద్దరూ పదేళ్ల కిందటే వలసొచ్చి శ్రీకాళహస్తిలో స్థిరపడ్డారు) కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మరొకరు 108 అంబులెన్స్ రప్పించే లోపే మరణించారు.
Updated Date - Apr 30 , 2025 | 05:52 AM