ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Department: బదిలీలతో పాటే పదోన్నతులు

ABN, Publish Date - May 11 , 2025 | 05:34 AM

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూలు త్వరలో విడుదల కానున్నది. ఈసారి బదిలీలతో పాటుగా టీచర్ల పదోన్నతులు కూడా చేపట్టాలని నిర్ణయించారు.

  • రెండు మూడ్రోజుల్లో షెడ్యూల్‌ విడుదలకు అవకాశం

  • ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ చర్చలు

అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. సోమ లేదా మంగళవారం బదిలీల షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈలోగా జీవో 117కు ప్రత్యామ్నాయంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జీవో విడుదల చేయనుంది. ఈసారి బదిలీలు, టీచర్ల పదోన్నతులను ఒకేసారి చేపట్టాలని నిర్ణయించారు. ఇందు లో భాగం గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు శనివారం మంగళగిరిలోని పాఠశాల విద్య కమిషనరేట్‌లో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహించారు. జీవో 117కు ప్రత్యామ్నాయం, పదోన్నతులు, బదిలీలపై సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ విధానాన్ని వారికి వివరించారు. సర్వీసు పాయింట్లను ఏడాదికి 0.5 నుంచి 1కి పెంచాలని సంఘాలు కోరగా ఈ ఏడాదికి కుదరదని తేల్చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటుచేసే మోడల్‌ ప్రె ౖమరీ స్కూళ్లలో మిగులు స్కూల్‌ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా నియమిస్తామన్నారు. కాగా, ఈసారి బదిలీల్లో నెగటివ్‌ పాయింట్లు కూడా ఉంటాయని, విధులకు అనధికారికంగా గైర్హాజరైతే నెలకు ఒక పాయింట్‌ చొప్పు న గరిష్ఠంగా పది నెగటివ్‌ పాయింట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు.

నిష్పత్తి మార్చండి

ఉన్నత పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి 1:40గా మార్చాలని నోబుల్‌ టీచర్స్‌ సంఘం అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరాజు, బి.హైమారావు కోరారు. అలాగే రేషనలైజేషన్‌కు కటాఫ్‌ తేదీని మార్చాలని ఓ ప్రకటనలో కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏప్రిల్‌లో డ్రాపౌట్‌ విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చారని, కానీ మార్చి 31 తేదీని పోస్టుల కేటాయింపునకు కటాఫ్‌ తేదీగా తీసుకున్నారని, దీనివల్ల పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా పోస్టులు రాలేదని వివరించారు.

Updated Date - May 11 , 2025 | 05:36 AM