ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Palla Srinivasa Rao: ఇంటింటికీ వెళ్లండి.. ప్రభుత్వం చేస్తున్న మేలు చెప్పండి

ABN, Publish Date - Jun 30 , 2025 | 03:37 AM

పదవులు అలంకారం కాదని, బాధ్యతగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రసంగించారు.

  • పదవులను బాధ్యతగా భావించాలి

  • ‘తొలి అడుగు’లో టీడీపీ నేతలు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): పదవులు అలంకారం కాదని, బాధ్యతగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ‘కూటమిలో మనం పెద్దన్న పాత్ర పోషించాలి. భాగస్వాములతో పొరపొచ్చాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. సమన్వయం ఉంటే ఎంత పెద్ద కార్యక్రమమైనా విజయవంతం అవుతుందనడానికి యోగాంధ్ర కార్యక్రమం నిదర్శనం. కేంద్ర క్యాబినెట్‌లో యోగాంధ్ర సక్సెస్‌ గురించి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి. 57 నియోజకవర్గాలు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో వెనుకబడ్డాయి’ అని అన్నారు.

ప్రజల మన్ననలు పొందాలి: పెమ్మసాని

ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును ఇంటింటికి వెళ్లి చెప్పాలని, అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. అమరావతిపై అపోహలను తొలగించాలని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మనం ముందుకు వెళ్లాలంటే కంపెనీలు రావాలన్నారు. ప్రభుత్వంపై నమ్మకం కలగాలని, ప్రతి నాయకుడు తమ తమ ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటుకు కృషి చేసి, ఉద్యోగ కల్పనకు సహకరించాలని కోరారు. స్కూళ్లు, హాస్టళ్లు, ఆసుపత్రుల పరిశీలనతో పాటు ప్రజా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందేలా నాయకులు నడుచుకోవాలన్నారు.

విజయం పార్టీ కార్యకర్తల కష్టం: కొల్లు

2024 ఎన్నికల్లో మనం సాధించిన విజయం పార్టీ కార్యకర్తల కష్టమని సగర్వంగా చెప్పగలమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తోట చంద్రయ్య లాంటి కార్యకర్తల ప్రాణ త్యాగాల వల్లనే మనం గెలిచామన్నారు. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించాలంటే కార్యకర్తల్ని కాపాడుకోవాలన్నారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలన్నారు.

ప్రజల వద్దకు వెళ్లాలి: టీజీ భరత్‌

నాటి చంద్రబాబు విజన్‌ 2020ని ఆదర్శంగా తీసుకుని తన నియోజకవర్గంలో విజన్‌ యాత్ర చేపట్టానని, డోర్‌ టు డోర్‌ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నానని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. గడప గడపకు వెళ్లినప్పుడు గ్రౌండ్‌ రియాలిటీ తెలుస్తుందని, అప్పుడే ప్రజలకు చేరువ కావొచ్చని, ప్రజా నాయకుడు కావచ్చని అన్నారు. టీవీలు, సోషల్‌ మీడియా ద్వారా మనకు తెలిసేది 50 శాతం మాత్రమేనని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలన్నారు.

చంద్రబాబు భరోసా ఇచ్చి గెలిపించారు: బైరెడ్డి శబరి

నంద్యాలలో తాను ఓడిపోతానని భయపెట్టారని, మన అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. చంద్రబాబు తనను ఎంపీగా కాకుండా కార్యకర్తగా పనిచేయాలని సూచించారని, తాను కార్యకర్తగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాని తెలిపారు. మహిళల పురోగతితోనే సమాజ వికాసం సాధ్యమని నమ్మి వారికి పెద్ద పీట వేసిన చరిత్ర టీడీపీదేనన్నారు.

చంద్రబాబు మాటలు స్ఫూర్తినిచ్చాయి: గురజాల జగన్‌మోహన్‌

నాడు జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు చంద్రబాబు మాటలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని, ఆదర్శంగా తీసుకుని పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ అన్నారు. విజనరీ లీడర్‌ చంద్రన్న సారథ్యంలో రాష్ట్రం, తెలుగు ప్రజలు ప్రపంచ పటంలో మేటిగా ఉండేందుకు తన వంతు పనిచేస్తానన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 03:40 AM