TDP wins Bobbili: టీడీపీ ఖాతాలో బొబ్బిలి మున్సిపాలిటీ
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:32 AM
బొబ్బిలి మున్సిపాలిటీలో టీడీపీ చేతికి అధికారాలు చేరాయి. వైసీపీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం 21 ఓట్లతో నెగ్గింది.
వైసీపీ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
బొబ్బిలి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ టీడీపీ వశం కానుంది. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావుపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మంగళవారం నెగ్గింది. మంగళవారం ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో జేవీఎ్‌సఎస్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. అవిశ్వాసానికి అనుకూలంగా పదిమంది టీడీపీ కౌన్సిలర్లు, తొమ్మిది మంది వైసీపీ రెబెల్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్ చేతులెత్తి మద్దతు తెలిపారు. వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడైన బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబినాయన కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. పది మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా చేతులెత్తారు. ఆర్డీవో రెండు సార్లు లెక్కించి.. అవిశ్వాసానికి అనుకూలంగా 21 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటు వేసినట్లు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పై కీలక ఒప్పందం
Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
For More AP News and Telugu News
Updated Date - Apr 30 , 2025 | 05:32 AM