NMUA: 12, 13 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ధర్నా
ABN, Publish Date - Aug 04 , 2025 | 05:17 AM
ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన సెటిల్‌మెంట్
విజయవాడ (బస్టేషన్), ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన సెటిల్‌మెంట్ బకాయిల సమస్యలతో పాటు ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని కోరుతూ ఈనెల 12, 13 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో కోట్లాది రూపాయల విలువచేసే ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 04 , 2025 | 05:17 AM