Share News

EC: తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:57 PM

రెండు ఓటర్లు కార్డులు కలిగి ఉండటం ద్వారా తేజస్వి నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. 2020 పోల్ అఫిడవిట్‌లో తేజస్వి చూపించిన ఓటర్ ఐడీ, శనివారం నాడు చూపించిన ఓటర్ ఐడీ ఒకటి కాదని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు.

EC: తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
Tejaswi Yadav

న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ప్రకటించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav)కు ఎన్నికల కమిషన్ (EC) ఆదివారం నాడు నోటీసు జారీ చేసింది. తేజస్వి తన వాదనను నిరూపించుకోవాలని ఆ నోటీసులో కోరింది. శనివారం నాడు మీడియా సమావేశంలో ఆర్జేడీ నేత చూపించిన ఓటర్ ఐడీ అధికారికంగా జారీ చేసినది కాదని తెలిపింది.


ఓటరు లిస్ట్‌లో తన పేరు చేర్చలేదని యాదవ్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. నిజానికి ఆయన పేరు సీరియల్ నెంబర్ 416లో పోలింగ్ స్టేషన్ 204లో ఉందని తెలిపింది. పోలింగ్ బూత్ పాట్నాలోని బిహార్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ లైబ్రరీలో ఉందని, EPIC నెంబర్ RAB0456228 అని పేర్కొంది.


కాగా, పాట్నా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదివారం నాడు రాసిన లేఖను కూడా ఈసీ ప్రస్తావించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తేజస్వి చూపించిన ఓటర్ ఐడీ RAB2916120పై ప్రాథమిక విచారణ జరుపగా అది అధికారికంగా జారీ చేసిన కార్డు కాదని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిపింది. ఆ దృష్ట్యా తేజస్వి మీడియా సమావేశంలో చూపించిన ఐడీ కార్డు, ఒరిజినల్ కార్డుతో సహా వివరాలు అందజేయాలని, తద్వారా విచారణ నిర్వహిస్తామని ఈసీ ఆ నోటీసులో పేర్కొంది. కాగా, ఈ వివాదానికి సంబంధించి తేజస్విపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రెండు ఓటర్ కార్డులు కలిగి ఉండటం ద్వారా తేజస్వి నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. 2020 పోల్ అఫిడవిట్‌లో తేజస్వి చూపించిన ఓటర్ ఐడీ, శనివారం నాడు చూపించిన ఓటర్ ఐడీ ఒకటి కాదని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే ప్రశ్నకు శశిథరూర్ ఏంచెప్పారంటే

కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. బలైపోయిన 11 మంది, డ్రైవర్ సేఫ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 06:26 PM