Sri Reddy: వైసీపీపై అభిమానంతోనే పోస్టులు పెట్టా
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:45 AM
వైసీపీపై అభిమానంతోనే పోస్టులు చేశానని నటి శ్రీరెడ్డి వివరణ ఇచ్చారు.చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమె పూసపాటిరేగ, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరయ్యారు.
పూసపాటిరేగ, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో హాజరైన నటి శ్రీరెడ్డి
పూసపాటిరేగ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): అనుచిత వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డి శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరయ్యారు. పూసపాటిరేగలో సీఐ జి.రామకృష్ణ, అనకాపల్లిలో సీఐ టీవీ విజయ్‌కుమార్ విచారణ అధికారులుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై నెల్లిమర్ల నగరపంచాయతీ కౌన్సిలర్ కింతాడ కళావతి 2024, డిసెంబరు 13న నెల్లిమర్ల పోలీ్‌సష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవంబరు 13న తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి అనకాపల్లి టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు... ఈ ఏడాది ఫిబ్రవరి 2న చెన్నెలో ఉంటున్న శ్రీరెడ్డికి నోటీసులు అందజేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన ఆమె... శనివారం మధ్యాహ్నం పూసపాటిరేగ, రాత్రి అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల వద్ద తన న్యాయవాదులతో కలసి విచారణకు హాజరయ్యారు. విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి పోలీసులు స్పష్టం చేశారు.
Updated Date - Apr 20 , 2025 | 04:46 AM