Registration Discount: ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ
ABN, Publish Date - May 01 , 2025 | 06:01 AM
సీఎర్డీఏ పరిధిలో ప్రభుత్వ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్లాట్ రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువగా ఉండేలా మునిసిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై బేస్ ప్రైస్, డెవలప్మెంట్ చార్జీలను విడిగా డాక్యుమెంట్లు చేసి తగ్గింపు కల్పించనుంది
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్లలో(ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లు), సీఆర్‌డీఏ ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలపై భారాన్ని తగ్గిస్తూ మునిసిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆమేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇకపై ప్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటును రెండుగా విడగొట్టాలని పేర్కొంది. బేస్ ప్రైస్... అమ్మకపు ధరలో 60 శాతం, డెవల్‌పమెంట్ చార్జీలు... మిగిలిన 40 శాతం... వేరు వేరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు తయారు చేయాలి. బేస్ ప్రైస్‌పై 7.5 శాతం, డెవల్‌పమెంట్ చార్జీలపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీ వసూలు చేస్తారు. దీంతో కొనుగోలుదారు ప్లాట్ ధరపై 7.5 శాతం చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 01 , 2025 | 06:01 AM