Share News

IPL 2025 CSK vs PBKS: సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్.. చెన్నై భారీ స్కోరు

ABN , Publish Date - Apr 30 , 2025 | 09:35 PM

వరుస పరాజయాలతో కునారిల్లుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఓ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ రోజు చెన్నైలోని స్వంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడుతోంది. ఆల్ రౌండర్ సామ్ కర్రన్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది.

IPL 2025 CSK vs PBKS: సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్.. చెన్నై భారీ స్కోరు
Sam curran

వరుస పరాజయాలతో కునారిల్లుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎట్టకేలకు ఓ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ రోజు చెన్నైలోని స్వంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో (Chepauk Stadium) పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడుతోంది (CSK vs PBKS). ఆల్ రౌండర్ సామ్ కర్రన్ (47 బంతుల్లో 88) చెలరేగడంతో చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది (IPL 2025). 19వ ఓవర్లో ఛాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి హ్యాట్రిక్‌తో పాటు నాలుగు వికెట్లు తీసి చెన్నైను కట్టడి చేశాడు.

sam2.jpg


టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలో పంజాబ్ బౌలర్లు చెలరేగారు. 48 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి చెన్నైను బెంబేలెత్తించారు. అయితే ఆ దశలో ఆల్ రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెన్నైను ఆదుకున్నాడు. బ్రెవిస్ (32)తో కలిసి నాలుగో వికెట్‌కు 70కు పైగా పరుగులు జోడించాడు.


బ్రెవిస్ అవుటైన తర్వాత సామ్ కర్రన్ మరింత రెచ్చిపోయాడు. అయితే యుజ్వేంద్ర ఛాహల్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చెన్నైకు షాకిచ్చాడు. దీంతో చెన్నై ఆశించిన స్థాయిలో భారీ స్కోరు చేయలేకపోయింది. దీంతో చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో చెన్నై ఇంత భారీ స్కోరు చేయడం ఇదే ప్రథమం. పంజాబ్ బౌలర్లలో ఛాహల్ నాలుగు, అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీశారు. యన్‌సెన్, ఒమరజ్జీ, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు. మరి, చెన్నై నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి.


ఇవి కూడా చదవండి..

MS Dhoni: చెన్నై టీమ్ మెరుగుపడాలంటే.. ధోనీ రిటైర్ కావడం మంచిది: ఆడమ్ గిల్‌క్రిస్ట్


IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే


మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 09:37 PM