Money Dispute: తల్లికి వందనం డబ్బు కోసం అత్తమామలపై అల్లుడు దాడి
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:33 AM
తల్లికి వందనం డబ్బు కోసం ఓ వ్యక్తి అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో మంగళవారం..
విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్యాయత్నం
ఘంటసాల (కృష్ణాజిల్లా), జూలై 16 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం డబ్బు కోసం ఓ వ్యక్తి అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిట్టూరి అజయ్-శ్రీలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అజయ్.. టైల్స్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న శ్రీలక్ష్మి తల్లిదండ్రులు కర్రా సుబ్బారావు, వెంకటలక్ష్మి ఇంటికి పది రోజుల క్రితం అజయ్ కుటుంబం వెళ్లింది. అజయ్ పెద్ద కుమార్తెకు తల్లికి వందనం పథకం ద్వారా రూ.13 వేల నగదు రాగా, అందులో రూ.8 వేలు తీసుకుని మద్యం తాగాడు. మిగిలిన రూ.5 వేలు కావాలని భార్యతో తరచూ గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె రూ.5 వేలు తన తల్లిదండ్రుల వద్ద దాచింది. మంగళవారం రాత్రి కూడా భార్యతో గొడవ పడిన అజయ్.. అడ్డొచ్చిన అత్త వెంకటలక్ష్మి, మామ సుబ్బారావులను విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. బాధితులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Jul 17 , 2025 | 05:33 AM