BJP MLC Somu Veerraju: జగన్‌కు ప్రశ్నించే అర్హతే లేదు
ABN, Publish Date - Jun 09 , 2025 | 03:51 AM
కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఏ విధంగానూ ప్రశ్నించే అర్హత లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఆయన నేతృత్వంలోని గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా అవినీతి మయమేనని పేర్కొన్నారు.
నాడు ఆయన పాలన అంతా అవినీతిమయం: సోము వీర్రాజు
అనంతపురం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఏ విధంగానూ ప్రశ్నించే అర్హత లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఆయన నేతృత్వంలోని గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా అవినీతి మయమేనని పేర్కొన్నారు. ఆయన ఆదివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ... ‘జగన్‌రెడ్డి లిక్కర్ పాలసీలో అనేక అక్రమాలు జరిగాయి. డిజిటలైజేషన్‌లో దేశం నంబర్-1 స్థానంలో ఉంటే.. ఏపీలో లిక్కర్ విక్రయాలు ఉద్దేశపూర్వకంగానే డిజిటలైజేషన్ చేయలేదు. అవినీతికి పాల్పడ్డారనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలదా?’ అని వైసీపీని నిలదీశారు. ‘ఇప్పుడేమో బటన్ నొక్కలేదని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నావు. నువ్వు సక్రమంగా బటన్ నొక్కి ఉండుంటే ప్రజలు ఎందుకు ఓడించారో సమాధానం చెప్పాలి. నీ తప్పుడు విధానాల వల్లే చివరికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ఫెయిలైందనంటున్నావు కదా.. నీ ఏడాది పాలనలో పాస్ అయ్యావా? అసలు దేని గురించీ ప్రశ్నించే అర్హత నీకు లేదు. నీవు ప్రతిపక్ష నాయకుడివా? ప్రశ్నించే అర్హత నీకుందా?.. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో’ అని జగన్‌పై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
Updated Date - Jun 09 , 2025 | 03:57 AM