ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Somireddy Chandra Mohan Reddy: నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ABN, Publish Date - Jul 14 , 2025 | 05:00 PM

రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడిలా నీవు నడవగలవా అంటూ పేర్ని నానికి సోమిరెడ్డి సవాల్ విసిరారు.

TDP MLA Somireddy Chandramohan Reddy

అమరావతి, జులై 14: కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో వైసీపీ కేడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి, ఆ పార్టీ నేత పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం అమరావతిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. పేర్ని నానికి కొవ్వు ఎక్కువైందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తిలో చంద్రబాబు నడిచినట్లు 7 కిలోమీటర్లు మీరు నడవగలరా అంటూ పేర్ని నానికి సవాల్ విసిరారు. నీ వయస్సు అయిపోయిందనే మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదంటూ పేర్ని నానికి ఈ సందర్భంగా చురకలంటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని ఇరికిస్తున్నాడని విమర్శించారు.

బతుకు జీవుడా అంటూ వల్లభనేని వంశీ ఇప్పుడే జైలు నుండి బయటికి వచ్చారన్నారు. రప్పా రప్పా టైటిల్‌తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయుంచు కోవచ్చంటూ వైసీపీ నేతలకు ఈ సందర్బంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. పేర్ని నానితోపాటు వైఎస్ జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా పనికి మాలిన వాళ్లంతా వైసీపీలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు.. స్పందించిన సోమిరెడ్డి

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. నిజాయితీపరుడైన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇచ్చి ప్రధాని మోదీ గౌరవించారని చెప్పారు.

దేశంలోని మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను రాష్ట్రపతి ద్రౌపది నియమించారు. ఆ జాబితాలో పూసపాటి అశోక్ గజపతి రాజు ఉన్నారు. గోవా కొత్త గవర్నర్‌గా ఆయన నియమితులయ్యారు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి లభించడం పట్ల టీడీపీ కేడర్‌లో హర్షం వ్యక్తమవుతుంది.

ఇవి కూడా చదవండి

గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వన్నె తేవాలి: సీఎం, లోకేష్

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 08:00 PM