ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chevireddy Bhaskar Reddy: ఓటర్లకు పంచడానికి లిక్కర్‌ డబ్బు

ABN, Publish Date - Jun 19 , 2025 | 04:37 AM

మద్యం ముడుపుల ద్వారా వెనకేసుకున్న డబ్బులను 2024 ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెల్లడించింది. ఈ డబ్బు తరలించడానికి నిందితులు ఏకంగా ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది.

  • చెవిరెడ్డి గన్‌మెన్‌, పీఏ, డ్రైవర్‌ల పాత్రను కోర్టులో వివరించిన సిట్‌

  • సాంకేతికంగా అన్ని ఆధారాలూ సేకరించాం

  • వాటి ఆధారంగానే చెవిరెడ్డి తదితరుల అరెస్టు

  • చెవిరెడ్డి, వెంకటేశ్‌కు 1 వరకు రిమాండ్‌

  • సిట్‌ ఆఫీసులో చెవిరెడ్డి చిందులు.. ఆస్పత్రి, కోర్టు, జైలు వద్ద కేకలు, అరుపులు

విజయవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మద్యం ముడుపుల ద్వారా వెనకేసుకున్న డబ్బులను 2024 ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెల్లడించింది. ఈ డబ్బు తరలించడానికి నిందితులు ఏకంగా ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు లోక్‌సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచనల మేరకు.. ఆయన గన్‌మెన్‌ గిరి, మదన్‌, వ్యక్తిగత సహాయకుడు బాలాజీ, డ్రైవర్‌ రామరాజు ఈ సొమ్మును రవాణా కంపెనీలు ఉపయోగించే ట్రక్కు ద్వారా తరలించారని పేర్కొంది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరించామని. వాటి ఆధారంగా నిందితులను అరెస్టు చేశామని తెలిపింది. కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని, ఆయన సన్నిహితుడు వెంకటేశ్‌నాయుడిని సిట్‌ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసి మంగళవారం రాత్రి విజయవాడ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం విజయవాడ సిట్‌ కార్యాలయంలో విచారించాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం చెవిరెడ్డి, వెంకటే్‌శ్‌నాయుడికి వచ్చే నెల ఒకటో తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు సిట్‌ తరఫున ప్రాసిక్యూషన్స్‌ ఏడీ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. గిరి, మదన్‌ 12 ఏళ్లుగా చెవిరెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. గిరిని విచారించి.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిగిలిన నిందితులను పట్టుకున్నామన్నారు. ‘చెవిరెడ్డి చెబితే ఆయన పీఏ బాలాజీ యాదవ్‌.. ఈ గన్‌మెన్‌, చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి ద్వారా డబ్బులను చేరవేశారు. ఈ కేసులో మోహిత్‌రెడ్డి 39వ నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 22న హైదరాబాద్‌ నుంచి తిరుపతికి డబ్బులు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లో ప్రథమ నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నుంచి ఈ డబ్బుల సంచులు తీసుకునేవారు. ఓటర్లకు పంపిణీ చేయడానికి హైదరాబాద్‌ నుంచి డబ్బులను విజయవాడ వైపు తీసుకొస్తుండగా ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద రూ.8.37 కోట్లను సీజ్‌ చేశారు. నంద్యాలకు చెందిన చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌నాయుడికి హైదరాబాద్‌లో ఇల్లుంది. అక్కడి నుంచి ఈ డబ్బులు జిల్లాలకు చేరాయి. సొమ్ము తరలింపులో సైమన్‌ అనే వ్యక్తితోపాటు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రతా్‌పరెడ్డి పాత్ర కూడా ఉంది. వెంకటేశ్‌నాయుడు, సైమన్‌ హైదరాబాద్‌ నుంచి ఫార్చ్యూనర్‌ కారులో తిరుపతికి నిత్యం డబ్బులు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి టవర్‌ లొకేషన్లను సేకరించాం. ఈ డబ్బుతో బంగారం కొనుగోలు చేశారు. రాష్ట్ర ఖజానాకు చెందాల్సిన డబ్బులను ఈ బ్యాచ్‌ లూటీ చేసింది’ అని తెలిపారు. చెవిరెడ్డి తరఫున దత్తకవి, రామచంద్రమూర్తి వాదనలు వినిపించారు. తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పట్టుబడిన డబ్బులను గరికిపాడు చెక్‌పోస్టు డబ్బులకు లింక్‌ చేసి చూపిస్తున్నారని అన్నారు.

మాల్దీవులకు వెళ్తుంటే అడ్డుకున్నారు: వెంకటేశ్‌నాయుడు

తన కుమారుడికి సెలవులు కావడంతో కుటుంబంతో మాల్దీవులకు వెళ్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకున్నారని నిందితుడు వెంకటేశ్‌నాయుడు తెలిపారు. న్యాయాధికారి ముందు ఆయన, ఆయన భార్య మాట్లాడారు. తాము ఒకసారి ఓ వివాహ వేడుకలో ఉండగా విచారణకు రావాలని పిలుపు వచ్చిందని..తర్వాత వస్తానని చెప్పానని వెంకటేశ్‌ చెప్పారు. మరోసారి.. విచారణకు వస్తుండగా యాంజియో సమస్య వచ్చిందని.. అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లి.. సిట్‌ అధికారులకు మెయిల్‌ చేశానని.. ఫోన్‌ చేసి కూడా చెప్పానన్నారు. తర్వాత ఎప్పుడు రావాలో చెబితే వస్తానన్నానని, దీనికి సిట్‌అధికారుల నుంచి స్పందన రాలేదని తెలిపారు. బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ సిబ్బంది అడిగితే తనపై ఎలాంటి కేసులూ లేవని చెప్పానన్నారు. విజయవాడలో ఏమైనా కేసు ఉందా అని అడిగినప్పుడు తనకు అనుమానం వచ్చిందని.. సాక్షిగా విచారణకు పిలిచిన తనపై ఎల్‌వోసీ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి మా కుటుంబం టార్గెట్‌: హర్షిత్‌రెడ్డి

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమ కుటుంబాన్ని టార్గెట్‌ చేసిందని చెవిరెడ్డి రెండో కుమారుడు హర్షిత్‌రెడ్డి ఆరోపించారు. తన తండ్రిపై పోక్సో కేసు పెట్టిందని మీడియాకు తెలిపారు. మద్యం వల్ల తాతయ్య, చిన్నాన్నను కోల్పోయామని, అప్పటినుంచి తాము మద్యం జోలికి వెళ్లలేదన్నారు. వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్తుంటే పారిపోతున్నామంటూ అక్రమ కేసు పెట్టారన్నారు. చెవిరెడ్డి సిట్‌ అధికారులకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. చెవిరెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి పేర్నినాని,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం,అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్‌ కోర్టుకు వచ్చారు.

పేపర్లు చించేసిన చెవిరెడ్డి

సిట్‌ కార్యాలయంలో చెవిరెడ్డిని విచారించాక.. వాంగ్మూలంపై సంతకాలు చేయాలని అధికారులు కాగితాలిచ్చారు. వాటిని ఆయన చించివిసిరేశారు. ఈ దృశ్యాన్ని సిట్‌ సిబ్బంది చిత్రీకరించారు. విచారణ సందర్భంగా ఆ వీడియోను న్యాయాధికారికి అందజేశారు. కాగా, ప్రభుత్వాస్పత్రి వద్ద, కోర్టు ఆవరణలో కూడా అరుపులు,కేకలతో చెవిరెడ్డి హంగామా చేశారు. అలాగే జైలు వద్ద కూడా కేకలు వేశారు. తనను అన్యాయంగా అరెస్టు చేశారని, తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. అధికారులు ఇదేజైలుకు రావానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

చెవిరెడ్డి స్వీయవాదనలు..

స్వయంగా న్యాయవాది అయిన చెవిరెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. బెంగళూరు నుంచి అర్ధరాత్రి సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారని.. 4 గంటలపాటు విచారించి 26 ప్రశ్నలు అడిగారని.. వాటికి తాను చెప్పిన జవాబులు కాకుండా అధికారులు వారికి నచ్చిన సమాధానాలు రాసుకున్నారని తెలిపారు. ఆ కాగితాలను తనకిచ్చి సంతకం చేయాలని ఒత్తిడి చేశారని.. తాను చేయనని చెప్పానన్నారు. తర్వాత ఆ కాగితాలను వెనక్కి తీసుకుని 26 ప్రశ్నలకు సమాధానాలు సరిచేసి 27వ ప్రశ్నకు జవాబు సరిచేయకుండా ఇచ్చారని.. దానిని తాను ఒక కాగితంపై రాసి ఇచ్చి జత చేయాలని చెప్పినా చేయలేదన్నారు. తనపై కేసు ఉందని గానీ, విచారణకు హాజరు కావాలని గానీ ఏ రోజునా సిట్‌ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. తాను ఎగుమతులు-దిగుమతుల వ్యాపారంలో ఉన్నానని.. వ్యాపార రీత్యా వెళ్తున్నప్పుడు బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారని తెలిపారు. విచారణలో కొట్టారా అని న్యాయాధికారి అడుగగా.. మానసికంగా ఇబ్బంది పెట్టారని బదులిచ్చారు. గిరి,మదన్‌ తనకు గన్‌మెన్‌గా ఉన్నారని..గిరితో సిట్‌ అధికారులు తమకు అనుకూలంగా వాంగ్మూలం తీసుకున్నారని.. ప్రతిఫలంగా అతడికి పదోన్నతి కల్పించి విజయవాడలోని ఆక్టోప్‌సలో పోస్టింగ్‌ ఇచ్చారని తెలిపారు.10మంది సిట్‌ అధికారులు తనను వేధించారంటూ మదన్‌ ఆత్మహత్యకు యత్నించాడని.. దీనిపై డీజీపీకి లేఖ రాశాడని తెలిపారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన రూ.8 కోట్లతో తనకు సంబంఽధం లేదన్నారు. అనంతరం రిమాండ్‌ విధించిన కోర్టు.. జైలులో చెవిరెడ్డికి మంచం, పరుపు, దిండు, దోమల తెర సమకూర్చేందుకు అనుమతిచ్చింది.

Updated Date - Jun 19 , 2025 | 04:37 AM