ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sharmila Accused Jagan Reddy: పోలవరం ఎత్తు తగ్గించిన పాపం జగన్‌దే

ABN, Publish Date - Jul 18 , 2025 | 05:01 AM

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన పాపం జగన్‌దేనని.. ఇప్పుడు ఏమీ తెలియననట్లు బీద ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharmila accused Jagan Reddy
  • చంద్రబాబు అవినీతి వ్యూహం బనకచర్ల: షర్మిల ఆరోపణలు

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన పాపం జగన్‌దేనని.. ఇప్పుడు ఏమీ తెలియననట్లు బీద ఏడుపులు ఏడుస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎ్‌సఆర్‌ కొడుకై ఉండి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీశారా అని ప్రశ్నించారు. మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారని గురువారం ఓ ప్రకటనలో నిలదీశారు. ‘2022లో పోలవరం నీటినిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకు కుదించిన పాపం గత వైసీపీ ప్రభుత్వానిది కాదా? అంచనా వ్యయాన్ని రూ.55వేల కోట్ల నుంచి రూ.37వేల కోట్లకు కుదించలేదా? బీజేపీకి అమ్ముడుపోయి మోదీ కోసం పోలవరం ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరడం బీద ఏడుపులే’ అని షర్మిల ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును చంపేసి బనకచర్ల రెగ్యులేటర్‌ అనుసంధాన పథకాన్ని కట్టాలనుకుంటున్నారా అని సీఎం చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి వ్యూహం బనకచర్ల అని ఆరోపించారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చుచేస్తే 50 లక్షల ఎకరాలకు సాగునీరు, కోటి మందికి తాగునీరు అందుతాయని తెలిపారు. పాత డీపీఆర్‌ ప్రకారమే 45.72 మీటర్ల కాంటూరులోనే పోలవరం నిర్మాణం జరపాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 05:01 AM