Weather Data Agreement: క్షణాల్లో వాతావరణ సమాచారం
ABN, Publish Date - Jun 03 , 2025 | 06:21 AM
షార్ (ISRO) మరియు ఆర్‌టీజీఎస్ మధ్య ఐదేళ్ల పాటు క్షణాల్లో వాతావరణ సమాచారం అందించే కీలక ఒప్పందం జరిగింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో వాతావరణ సమాచారం సమయోచితంగా అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తారు.
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఉపగ్రహం ద్వారా క్షణాల్లో వాతావరణ సమాచారం అందించేలా షార్ (ఇస్రో)తో ఆర్‌టీజీఎస్ కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, సీఎస్ విజయానంద్ సమక్షంలో ఐదేళ్లపాటు వాతావరణ సమాచారాన్ని అందించేలా షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, ఆర్‌టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందం వల్ల వాతావరణ సమాచారం ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సహా ఆర్‌టీజీఎస్‌కు చేరతాయి. దీని ఆధారంగా అధికారులు ఎస్‌ఎంఎ్‌సలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
షార్‌తో ఆర్‌టీజీఎస్ కీలక ఒప్పందం..
Updated Date - Jun 03 , 2025 | 11:43 AM