AP Rain Forecast: తీరం దాటిన తీవ్ర వాయుగుండం
ABN, Publish Date - May 30 , 2025 | 04:49 AM
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటి రాసుకున్నది. రాష్ట్రంలో కోస్తా, రాయలసీమలో వర్షాలు, పిడుగులు కురిసే అవకాశాలు ఉన్నాయి.
నేడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తీవ్ర వాయుగుడంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. సముద్రం అల్లకల్లోంగా మారినందున కోస్తాలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, వాయుగుండం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు, రాయలసీమలో నంద్యాల, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది.
Updated Date - May 30 , 2025 | 04:51 AM