ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sajjala Rama Krishna Reddy: నిరసన తెలుపుతున్న రాజధాని ప్రజలపై నోరు పారేసుకున్న సజ్జల..

ABN, Publish Date - Jun 09 , 2025 | 02:50 PM

రాజధాని మహిళలను సాక్షి మీడియా చర్చ కార్యక్రమంలో కించపరుస్తూ మాట్లాడడంపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సాక్షి మీడియా కార్యాలయాల ఎదుట ప్రజలు ఆందోళనలకు దిగారు.

YCP Leader Sajjala Rama Krishna Reddy

అమరావతి, జూన్ 09: రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. సాక్షిలో చేసిన ఆ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. అలాగే రాజధాని మహిళలపై అక్కసు వెళ్లగక్కుతూ తీవ్ర పదజాలంతో దూషించారు. సోమవారం ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసనలు చేస్తున్న మహిళలను పిశాచాలు, రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఆవేదనతో నిరసనలు చేస్తున్న రాజధాని మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ అర్గనైజ్డ్‌గా ఉన్న సంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సంచలనంగా మారింది.

సాక్షి మీడియాలో ఇటీవల చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. అంతేకాకుండా.. ఈ వ్యాఖ్యలను ఆయన చాలా సాదా సీదాగా తీసుకున్నారు. అయితే ఈ చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. వివిధ జిల్లాల్లోని సాక్షి కార్యాలయాల వద్దకు భారీగా ప్రజలు చేరుకుని ఆందోళనలు చేపట్టారు. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుతోపాటు సాక్షి మీడియాపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు.

అలాంటి వేళ ఈ వ్యవహారంపై అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలపై సైతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సాక్షి చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన తీరు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇంకోవైపు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు హోంమంత్రి వంగలపూడి అనిత వేర్వేరుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేయడం దారుణమంటూ వారు ఖండించారు. దీని వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదంటూ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 03:49 PM