Renuka chowdhury: జగన్ గుట్టు విప్పిన రేణుకా చౌదరి
ABN, Publish Date - Jun 09 , 2025 | 09:02 PM
అమరావతిపై వైఎస్ జగన్ పట్టిన కక్ష సాధింపు అందరికి గుర్తు ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. దమ్ము ధైర్యం ఉంటే.. అమరావతిలో పర్యటించాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆమె సవాల్ విసిరారు.
హైదరాబాద్, జూన్ 09: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి మానసిక చికిత్సను తాను ఉచితంగా చేయిస్తానని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రకటించారు. సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై చేసిన కామెంట్ పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ చిన్నతనంలో వ్యవహరించిన తీరును ఆమె ఎండగట్టారు. అలాగే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతిక కాయానికి ఇంకా అంత్యక్రియలు కూడా జరగకుండానే.. అధికార దాహంతో సంతకాలు సేకరణ వైఎస్ జగన్ చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. వైఎస్ జగన్ తీరు దున్నపోతు మీద వాన పడిన చందమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన కుటుంబ సభ్యులను కామెంట్ చేస్తే.. ఎలా వ్యవహరించారో అందరు చూశారన్నారు. మరి బయట వాళ్లను మాటలు అంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరైనా తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు. ఖండిస్తారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో మహిళల పట్ల వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి సోదాహరణగా వివరించారు.
అమరావతిపై వైఎస్ జగన్ పట్టిన కక్ష సాధింపు అందరికి గుర్తు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే.. అమరావతిలో పర్యటించాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆమె సవాల్ విసిరారు. మహిళలను అతి తక్కువ అంచనా వేశారని.. దీనిని త్వరలో తానే నిరూపిస్తాన్నారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ వ్యవహారశైలిపై ఆమె నిప్పులు చెరిగారు. ఈ పేపరు, టీవీని ముందు మూసివేయాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు.
మీడియా ఎలా నడుస్తుందో తాను చూస్తానన్నారు. ఇటీవల వైసీపీ మీడియాలోని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు జర్నలిస్టులా అంటూ సందేహం వ్యక్తం చేశారు. మహిళలు వేసుకున్నవి గాజులు కాదని.. విష్ణు చక్రాలని ఆమె అభివర్ణించారు. జగన్ బతుకేంటో తనకు తెలుసునన్నారు. ఇక సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగిన మహిళ పట్ల వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన తీరును ఖండించారు. ఈ సందర్భంగా సజ్జలపై సైతం ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
సిలికాన్ వ్యాలీలా క్వాంటమ్ వ్యాలీకి ప్రత్యేక గుర్తింపు
క్షమాపణలు చెప్పాల్సిందే: వైఎస్ షర్మిల
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 09:35 PM