Rare Green Insect: గడ్డి మొక్క కాదు... ఇదీ పురుగే
ABN, Publish Date - May 27 , 2025 | 05:01 AM
ఆకుపచ్చగా గడ్డి మొక్కలా కనిపించే అరుదైన ఫోకోడెర్మా వెలుటినా పురుగు చింతపల్లిలో కెమెరాకు చిక్కింది. దీనిని తాకితే దురద వచ్చే అవకాశం ఉందని కీటక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆకుపచ్చ రంగులో గడ్డి మొక్కలా కనిపిస్తున్న ఇది అరుదైన జాతి పురుగు. సోమవారం చింతపల్లి డిగ్రీ కళాశాల మైదానంలో కెమెరాకు చిక్కింది. గొంగళి పురుగు జాతికి చెందిన ఈ పురుగును ఫోకోడెర్మా వెలుటినా అంటారని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కీటక విభాగం టీచింగ్ అసోసియేట్ కె.బాబూజీనాయుడు చెప్పారు. ఈ పురుగు శరీరాన్ని తాకితే దురద వస్తుందని తెలిపారు.
- చింతపల్లి, ఆంధ్రజ్యోతి
Updated Date - May 27 , 2025 | 05:02 AM