Healthcare Accountability India: అబార్షన్ చేస్తుండగా గర్భిణి మృతి
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:55 AM
ఐదు నెలల గర్భిణి అబార్షన్ చేస్తుండగా ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె కుటుంబీకులు, బంధువులు
ఆస్పత్రి వద్ద బాధితురాలి బంధువుల ఆందోళన
అనంతలో ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
అనంతపురం వైద్యం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఐదు నెలల గర్భిణి అబార్షన్ చేస్తుండగా ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన మల్లికార్జున, రాధిక (34) దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాధిక ఐదు నెలల గర్భిణి కాగా, అబార్షన్ చేయించేందుకు భర్త అనంతపురంలోని రామచంద్రనగర్‌లో ఉన్న శ్రీకృప ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆదివారం వైద్యులు అబార్షన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. మూడు గంటల తర్వాత రాధిక మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకుని వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వైద్యులు, మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. అనంతపురం త్రీటౌన్ పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. జిల్లా వైద్య శాఖాధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 04 , 2025 | 04:55 AM