ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: గెలిచింది ప్రజలు

ABN, Publish Date - Jun 24 , 2025 | 05:52 AM

రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి లోకేశ్‌ అన్నారు.

  • నాటి విధ్వంస పాలనపై తిరగబడ్డారు.. ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పారు

  • ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె.. అధికారులూ ప్రజలకు దగ్గరవ్వాలి: లోకేశ్‌

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి లోకేశ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సుపరిపాలన- తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరూ కూటమి గెలిచిందని అంటున్నారని, కానీ గెలిచింది కూటమి కాదు.. గెలిచింది ప్రజలు అని స్పష్టం చేశారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..

కంపెనీలను తరిమేశారు.

గత ఐదేళ్లు విధ్వంస పాలన చూశాం. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చేశారు. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలను తరిమేశారు. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం.. ఏపీలో మాత్రం పెట్టబోమని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు వేయలేదు. విశాఖపట్నంలో రూ. 700 కోట్లతో రాయల్‌ ప్యాలెస్‌ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్‌,విశాఖఉక్కు గురించి పట్టించుకోలేదు. గడిచిన ఐదేళ్లు అరాచకపాలన సాగింది. దళిత బిడ్డల్ని చంపి డోర్‌ డెలివరీ చేశారు. మాస్కు అడిగినందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌ను వేటాడి, వెంటాడి చంపేశారు.

ప్రజలకు ప్రశాంతత వచ్చింది

సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారు ప్రజాప్రభుత్వం ఏడాదిలో ఏం సాధించింది అని అడుగుతున్నారు. నేను వారికి సూటిగా సమాధానం చెబుతున్నా.. ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలకు ప్రశాంతత వచ్చింది. అన్ని సమస్యలను పరిష్కరించేశాం అని చెప్పడం లేదు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.

పేదరికం లేని సమాజమే లక్ష్యం

పేదరికం లేని సమాజం చూడాలనేది చంద్రబాబు లక్ష్యం. అందుకే పీ4 విధానం తీసుకొచ్చారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడమే పీ4 ఉద్దేశం. పవనన్న ఆధ్వర్యంలో పంచాయతీలకు స్వాతంత్య్రం వచ్చింది. పంచాయతీలకు రూ.వెయ్యి కోట్లు నిధులు విడుదల చేశాం. రైతుల నుంచి 56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాప్రభుత్వం అజెండా. కేవలం ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 8.5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. రాయలసీమను ఆటోమొబైల్‌, ఎలకా్ట్రనిక్స్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, హార్టీకల్చర్‌ హబ్‌గా తయారు చేస్తున్నాం.

డబుల్‌ స్పీడ్‌తో అమరావతి

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ మన పవర్‌. రాష్ట్రం అడిగిన ప్రతి కోరిక ప్రధాని మోదీ తీరుస్తున్నారు. గత ప్రభుత్వం నాశనం చేయాలనుకున్న అమరావతిని డబుల్‌ స్పీడ్‌తో పట్టాలెక్కించాం. రూ. 60 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. రాజధానికి 15 వేల కోట్లు, పోలవరానికి 12 వేల కోట్లు ఇవ్వడంతో పాటు విశాఖస్టీల్‌ ప్లాంట్‌కు 11,500 కోట్లు సాయం అందించారు. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల అభివృద్ధికి 5వేల కోట్లు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు సహకరించారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకరిస్తున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

విద్యాశాఖలో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రిగా నా శాఖలో సంస్కరణలు తెస్తున్నా. రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థ ఉండాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యం. గత పాలనలో యూనిఫారం దగ్గర నుంచి చిక్కీ వరకూ ఫొటోలు, రంగుల పిచ్చి మీరంతా చూశారు. మేం ఎలాంటి ఫొటోలు, రంగులు లేకుండానే అవన్నీ ఇస్తున్నాం. వైసీపీ వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 6,500 కోట్లు పెట్టి పోయారు. బకాయిలన్నీ క్రమపద్ధతిలో తీరుస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మారుస్తున్నాం. బ్యాగ్‌ బరువు తగ్గించేలా పుస్తకాలు సిద్ధం చేశాం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమించాం. ఆయన నైతిక విలువలపై చక్కటి వీడియోలు, పుస్తకాలు సిద్ధం చేశారు. మహిళల్ని గౌరవించాలి అని విద్యార్ధి దశ నుంచే నేర్పిస్తున్నాం.

ప్రభుత్వ ఉద్యోగులకు హ్యాట్సాఫ్‌

ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె వంటివారు. సీఎస్‌ నుంచి చిన్న ఉద్యోగి వరకు ఏడాది కాలంగా కష్టపడి పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ హ్యాట్సాఫ్‌. ముఖ్యంగా నా టీచర్లు పూర్తిస్థాయిలో నాకు సహకారం అందించారు. అనేక హామీలను ఇచ్చి ఉద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. గత ప్రభుత్వ బకాయులు చెల్లిస్తున్నాం. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మరింత దగ్గరవ్వాలి. అనేక సమస్యలతో వారు మీ దగ్గరకు వస్తారు. వారిని అప్యాయంగా పలకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి.

Updated Date - Jun 24 , 2025 | 05:52 AM