College Admissions: 1,18,525 మందికి ఇంజనీరింగ్ సీట్లు
ABN, Publish Date - Jul 24 , 2025 | 04:28 AM
ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులకు తొలి విడత సీట్ల కేటాయించారు.
కన్వీనర్ కోటాలో 33,721 సీట్లు మిగులు
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులకు తొలి విడత సీట్ల కేటాయించారు. కన్వీనర్ కోటాలో మొత్తం 1,52,246 సీట్లు అందుబాటులో ఉండగా 1,18,525 సీట్లు కేటాయించినట్లు ఈఏపీసెట్ కన్వీనర్ జి.గణేశ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 24 ప్రభుత్వ కాలేజీల్లో 7,708 సీట్లు అందుబాటులో ఉండగా 6,860(88.99శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. 210 ప్రైవేటు కాలేజీల్లో 1,32,535 సీట్లు ఉంటే 1,00,773(76.03శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. 10 ప్రైవేటు యూనివర్సిటీల్లో 12,003 సీట్లు ఉండగా 10,892(90.74శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా 33,721 సీట్లు మిగిలిపోయాయి. 49 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఒక్క కాలేజీ జీరో అడ్మిషన్ల జాబితాలో మిగిలింది. రెండు కాలేజీల్లో 10లోపు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. వివిధ కాలేజీల్లో 66 బ్రాంచ్‌ల్లో ఒక్క సీట్లు కూడా భర్తీ కాలేదు. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలోనే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. .
ఈసెట్‌లో 20,837 మందికి సీట్లు
ఈసెట్ కౌన్సెలింగ్‌లో 20,837 మందికి సీట్లు కేటాయించినట్లు ఈసెట్ కన్వీనర్ తెలిపారు. 19 యూనివర్సిటీ కాలేజీల్లో 1,800 సీట్లు అందుబాటులో ఉండగా 1,485 సీట్లు భర్తీ అయ్యాయి. 315 మిగిలిపోయాయి. 214 ప్రైవేటు కాలేజీల్లో 34,734 సీట్లు ఉంటే 19,352 భర్తీ అయ్యాయి. 15,382 మిగిలిపోయాయి.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
Updated Date - Jul 24 , 2025 | 04:28 AM