YCP: టీడీపీలో చేరనున్న 15 వందల మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు
ABN, Publish Date - Jun 02 , 2025 | 10:40 AM
YCP: 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయంపాలైంది. కేలవం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan)కి భారీ షాక్ (Big Shock)లు తగులుతున్నాయి. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు వైసీపీ (YCP) నుంచి జంప్ (Jump) కాగా.. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore Dist), కోవూరు (Kovur)లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మానేగుంట, రామన్నపాళెం, రెడ్డిపాళెం, కమ్మపాళెం పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లోనూ మాజీ మంత్రి ప్రసన్న (Ex Minister Prasanna) తీరుపై వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 1500 మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరబోతున్నారు. ఈ సందర్భంగా వారికి ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నాపా వెంకటేశ్వర్లు నాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
కాగా 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయంపాలైంది. కేలవం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇలా అవుతుందని జగన్ కూడా ఊహించలేదు. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల వల్లే వైసీపీకి ఈ స్థాయి ఫలితాలు వచ్చాయంటూ.. పార్టీ అధినేత జగన్ మొదలు ముఖ్య నేతలు అందరూ ఇదే తీరుగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని చెబుతున్నారు. జగన్ మంచితనమే తమ ఓటమికి కారణమైందని కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రంలో ఫలితాలు అన్ని జిల్లాల్లో ఎలా ఉన్నా.. కడప తర్వాత వైసీపీకి అంతటి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా ఫలితాలు దారుణంగా ఉండడం ఎవరు ఊహించలేదు.
Also Read: పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టకుండా తప్పుచేసామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ప్రధాని మోదీ అన్ని అంశాల్లో జగన్ మద్దతు తీసుకున్నారని చెప్పారు. అయితే ఈ సారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుంటే నష్టపోతామన్నారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్..
For More AP News and Telugu News
Updated Date - Jun 02 , 2025 | 10:40 AM