ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Udayagiri: ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. వైద్యం కోసం వెళ్లిన బాలికపై..

ABN, Publish Date - Jun 11 , 2025 | 05:05 PM

ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన చిన్నారి పట్ల వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై చిన్నారి తల్లిదండ్రులు దాడికి యత్నించారు.

Udayagiri Government Hospital

నెల్లూరు, జూన్ 11: ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వెళ్లిన చిన్నారి పట్ల డాక్టర్ ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకుని డాక్టర్‌ ప్రశాంత్‌పై దాడికి యత్నించారు. కాగా, ఈ దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

చిన్నారి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బాగా నీరసించిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పాపను తల్లిదండ్రలు ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి చికిత్స అందించే క్రమంలో డాక్టర్ ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు గుర్తించారు. అతడి వ్యవహారంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చే లోపు.. డాక్టర్‌ ప్రశాంత్‌తో చిన్నారి తరఫు బంధువులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. డాక్టర్‌పై వారంతా ముకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని డాక్టర్ ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు అనంతపురంలో ఇటీవల ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. అదే జిల్లాలో ఎనిమిదోొ తరగతి చదువుతున్న బాలికపై రెండేళ్లుగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. వారిలో ఆరుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రెండు ఘటనలపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆడపిల్లలపై చేయి వెయ్యాలంటేనే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలని పోలీసులు అధికారులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ఎమ్మెల్యే కోసం యువకులు వీరంగం.. ఎందుకంటే..

కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

For More AP News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 06:32 PM