ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Leader Attacks: మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:18 PM

YSRCP Leader Attacks: కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చెంచుగానిపాలెం గ్రామంలో మాజీ ఏఎంసీ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ నివాసానికి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వచ్చాడు.

YSRCP Leader Attacks

నెల్లూరు, జూన్ 12: జిల్లాలోని కావాలిలో ఓ దళిత వ్యక్తి పట్ల వైసీపీ నేత (YSRCP Leader) అరాచకానికి పాల్పడ్డాడు. మామా అని పిలిచినందుకు ఓ దళితుడిపై వైసీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రసాద్ యాదవ్ (YSRCP Leader Prasada Yadav) దాడి చేశాడు. దీంతో కులం పేరుతో వైసీపీ నేత దూషించి దాడి చేశాడని బాధితుడు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.

ఇటీవల కాలంలో కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చెన్నాయపాలెం గ్రామంలో మాజీ ఏఎంసీ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ నివాసానికి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వచ్చాడు. ‘ఆలయానికి సంబంధించి ఉత్సవాలు చేసుకునేందుకు సమావేశాలు ఉన్నాయి.. మీరు రావాలి మామా’ అని పిలిచాడు సుబ్రహ్మణ్యం. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రసాద్.. నన్ను మామా అంటావా.. నీ కులం ఏంది, మతం ఏంది అంటూ కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేశారు. ఈ ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌పై దాడి, అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ పల్లెకు వెళ్లినా కూడా కులాలకు అతీతంగా పిలుపులు ఉంటాయి. కులాల ప్రస్తావనే ఎక్కడా ఉండదు. కానీ ఓ దళిత వ్యక్తి.. వైసీపీ నేత ఇంటికి వచ్చి మామా అని గౌరవంగా పిలిచినందుకు దాడి చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, గ్రామాల్లో అంతా కూడా కలిసి మెలిసి ఉండేవాళ్లమని, గ్రామాలను అభివృద్ధి చేసుకునేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మామా అని గౌరవంగా పిలిస్తే కూడా దళితుడు అన్న కారణంగా సుబ్రహ్మణ్యంపై విచక్షణారహితంగా దాడి చేయడం, కులం పేరుతో దూషించడాన్ని ప్రతీఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలి ఏరియా ఆస్పత్రిలో మారణాయుధాలతో వీరంగం సృష్టించిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. కావాలిలో వైసీపీ నేతల అరాచకాలను భరించలేకపోతున్నామని దళిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్

కవితను పలకరించని కేసీఆర్‌!

Read latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 12:57 PM