TDP Mahanadu 2025: కొత్త చరిత్రకు నాంది.. కడప మహానాడుపై లోకేష్ మార్క్
ABN, Publish Date - May 26 , 2025 | 08:53 PM
TDP Mahanadu 2025: పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో.. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలపై మంత్రి లోకేష్ కసరత్తు చేశారు. ఫ్రెష్ లుక్.. యంగ్ బ్లడ్ థీమ్‌తో కడప మహానాడు ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కడప జిల్లాలో మంగళవారం నుంచి జరగబోయే తెలుగు దేశం పార్టీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మహానాడుకు తరలివస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌తో పాటు పార్టీకి చెందిన అగ్ర నేతలు అందరూ కడపకు చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే కడప మహానాడుపై మంత్రి లోకేష్ మార్క్ కనిపించనుంది. పార్టీకి కొత్త లుక్ తెచ్చేలా సిక్స్ పాయింట్ ఫార్ములాలను ఆయన రూపొందించారు.
తెలుగు జాతి - విశ్వ ఖ్యాతి, స్త్రీ శక్తి, పేదల సేవలో, యువగళం, అన్నదాతకు అండ, కార్యకర్తే అధినేత అంశాల్లో కొత్త విధానాలకు రూపకల్పన చేశారు. పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో.. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలపై మంత్రి లోకేష్ కసరత్తు చేశారు. ఫ్రెష్ లుక్.. యంగ్ బ్లడ్ థీమ్‌తో కడప మహానాడు ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహానాడును తొలిసారిగా కడపలో చేపట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇప్పటి వరకు రాయలసీమలో తిరుపతి మినహా మరే ప్రాంతంలోనూ మహానాడు జరగలేదు. ఇప్పటి వరకు మొత్తంగా 30 మహానాడులు జరిగాయి. ఈ 30లో ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగాయి. తెలుగు దేశం పార్టీ మహానాడులు ఏ ప్రాంతంలో.. ఎన్ని సార్లు జరిగాయో ఓ లుక్ వేస్తే..
హైదరాబాద్-16
విజయవాడ-4
తిరుపతి-3
విశాఖ-3
రాజమండ్రి-2
వరంగల్- 1
ఒంగోలు-1
ఇవి కూడా చదవండి
ఇంటి బయట న్యూస్ పేపర్ కనిపించిందా.. ఇళ్లు నాశనం చేస్తారు..
బైకుపై వచ్చి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళపై దారుణం..
Updated Date - May 26 , 2025 | 08:53 PM