Share News

Viral Video: బైకుపై వచ్చి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళపై దారుణం..

ABN , Publish Date - May 26 , 2025 | 06:51 PM

Viral Video: ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ దృశ్యాల తాలూకా వీడియోను సచిన్ గుప్త అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Viral Video: బైకుపై వచ్చి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళపై దారుణం..
Viral Video

కామానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు కొందరు మగాళ్లు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. తమ పాడు బుద్ధికి బలి చేస్తున్నారు. కొందరు కామాంధులు నలుగురూ ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా.. పట్ట పగలు నడిరోడ్డుపై ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళతో తప్పుగా ప్రవర్తించాడు. బైకుపై వచ్చిన అతడు ఆమెను ముద్దు పెట్టుకుని పరారయ్యాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, మీరట్‌కు చెందిన ఓ మహిళ మే 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ ఇరుకైన సందులో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఓ యువకుడు బైకుపై ఆమెకు ఎదురుగా వచ్చాడు. బైకు రావటంతో ఆమె కొంచెం పక్కకు జరిగింది. ఆ యువకుడు మాత్రం బైకును ఆమె దగ్గరగా ఆపాడు. వెంటనే ఆమెను ముద్దుపెట్టుకుని అక్కడినుంచి పరారయ్యాడు. ఆ మహిళ షాక్ అయింది. కోపం కట్టలు తెంచుకుంది.


ఆ కామాంధుడ్ని బూతులు తిట్టింది. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ దృశ్యాల తాలూకా వీడియోను సచిన్ గుప్త అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ కామాంధుడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. పోలీసులు మహిళతో తప్పుగా ప్రవర్తించిన ఆ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Optical Illusion: ప్రేమలో మీరు నిజాయితీపరులా లేక మోసగాళ్లా.. ఫొటో చూసి తెలుసుకోండి..

Viral Video: ఇదేందయ్యా ఇది.. జలపాతాన్ని తలపిస్తున్న మెట్రో స్టేషన్..

Updated Date - May 26 , 2025 | 06:58 PM