Minister Narayana: మున్సిపల్ వర్కర్ల సమస్యలు సీఎం దృష్టికి
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:56 AM
మున్సిపల్ వర్కర్లకు జీతం పెంపు విషయంలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ మాట్లాడుతూ యూనియన్ ప్రతినిధులతో ముసాయిదా మరియు ఆర్థిక శాఖతో సలహాలు చేస్తామని తెలిపారు.
పురపాలక శాఖ మంత్రి నారాయణ
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ వర్కర్ల సమస్యలపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్కర్లు పని చేస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వం వారిలో కొంతమందికి రూ.6 వేలు పెంచిందని, మిగిలిన వారు తమకు కూడా రూ.6 వేలు పెంచాలని కోరుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు. వారి డిమాండ్లపై యూనియన్ ప్రతినిధులతో చర్చించామన్నారు. ఆర్థిక మంత్రి, అధికారులతో కూడా చర్చిస్తామని తెలిపారు.
Updated Date - Jun 03 , 2025 | 04:57 AM