ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి చర్యలు: కొండపల్లి
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:37 AM
ఏపీలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి కోసం భూముల గుర్తింపు, మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవసరమైన భూముల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ఎంఎ్‌సఎంఈ పార్కుల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం ఈ పార్కుల పురోగతి, స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 04:37 AM