MP Lavu Srikrishna Devaraya: సాక్షి పై కఠిన చర్యలు తీసుకోండి
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:06 AM
అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం జాతీయ మానవహక్కుల కమిషన్...
ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూ, పీసీఐకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు
గుంటూరు, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళ కమిషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఈ నెల 6వ తేదీన ఆ చానల్‌లో పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారని, రాజధాని మహిళలపై విషం చిమ్మారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. ఆ టీవీ ఛానల్‌పై సుమోటోగా చర్యలు చేపట్టాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jun 09 , 2025 | 04:08 AM