ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Family Tragedy: తల్లీ, కుమార్తెల దారుణ హత్య

ABN, Publish Date - Aug 04 , 2025 | 04:51 AM

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ శివారులోని సీతారామ కాలనీలో దారుణం జరిగింది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్యను..

  • భర్త ఇంట్లో లేని సమయంలో ఘటన

  • కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం

  • రంగంలోకి క్లూస్‌టీం.. పోలీసు దర్యాప్తు ముమ్మరం

సామర్లకోట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ శివారులోని సీతారామ కాలనీలో దారుణం జరిగింది. భర్త ఇంట్లో లేని సమయంలో భార్యను, ఇద్దరు కుమార్తెలను ఆగంతకులు కిరాతకంగా హత్య చేశారు. హత్యకు గురైన చిన్నారుల్లో ఒకరికి ఎనిమిది ఏళ్లు, మరొకరికి నాలుగేళ్లు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న ములపర్తి ప్రసాద్‌ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చాడు. ఎంతసేపు కొట్టినా తలుపులు తీయకపోవడంతో వెనుక వైపు తలుపులు తొలగించి లోనికి వెళ్లాడు. గది మధ్యలో భార్య మాధురి (26), కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీ లోవ (6) రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే సామర్లకోట పోలీసులకు సమాచారం అందించాడు. సామర్లకోట సీఐ కృష్ణభగవాన్‌, సిబ్బందితో సంఘటనా స్థలిని పరిశీలించారు. హతుల ఒంటిపై గాయాలను బట్టి మాధురిని ఇనుపరాడ్డుతోను, పిల్లలను రాళ్లతోనూ కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. క్లూస్‌ టీం, పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఘటనపై ఆరా తీశారు. హంతకుల కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు ప్రారంభించాయని సీఐ వెల్లడించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:51 AM