Nimmala Ramanaidu: నదుల అనుసంధానం
ABN, Publish Date - May 07 , 2025 | 04:57 AM
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల లక్ష్యం నదుల అనుసంధానమేనని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిపుణుల బృందాన్ని ఆదేశించారు
మోదీ, చంద్రబాబుల లక్ష్యం: నిమ్మల
పోలవరం, మే 6(ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలసి పోలవరం ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ఎగువ కాపర్ డ్యాం, బట్రస్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణంలో జరుగుతున్న గ్రాబ్ కట్టింగ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు కార్యాలయంలో విదేశీ నిపుణుల బృందంతో సమావేశమయ్యారు. బట్రస్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణాలు త్వరితగతిని పూర్తయ్యేలా, గ్యాప్-1, 2, డయాఫ్రం వాల్ డిజైన్లకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని నిపుణుల బృందాన్ని కోరారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ బి.పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో, సీన్ హెంచ్‌బెర్గర్, రిచర్డ్ డొనెల్లీ, సీఈ కె.నరసింహమూర్తి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పీపీఏ కార్యదర్శి ఎం.రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ భక్షి, రాకేశ్, తేజ, అశ్వనీ కుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సీఎ్‌సఎంఆర్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 04:57 AM