Lokesh: పరదాలు తీయించిన మంత్రి లోకేశ్
ABN, Publish Date - Jun 17 , 2025 | 06:01 AM
విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో సీఎం చంద్రబాబు సోమవారం యోగాంరఽధపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బీచ్ రోడ్డులో ఉన్నవారికి హోటల్...
విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో సీఎం చంద్రబాబు సోమవారం యోగాంరఽధపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బీచ్ రోడ్డులో ఉన్నవారికి హోటల్ కారిడార్‌లో ఉన్నవారు కనపడకుండా తెల్లటి పరదాలు కట్టారు. సమీక్షకు వచ్చిన మంత్రి లోకేశ్ బీచ్ వైపు చూడగా, అన్నీ పరదాలే కనిపించాయి. దాంతో ఆయన పోలీసు అధికారులను పిలిచి మాట్లాడారు. పరదాల ప్రభుత్వం పోయిందని, ఇప్పుడు పరదాలు వేయాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే వాటిని తీసివేయించారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి.
Updated Date - Jun 17 , 2025 | 06:02 AM