ఏడాది పాలనలో మైనార్టీలకు మహర్దశ మంత్రి ఫరూక్ ఉద్ఘాటన
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:10 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవగా, కూటమి ప్రభుత్వం సుపరిపాలనవైపు వేగంగా ముందుకు వెళ్తోందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవగా, కూటమి ప్రభుత్వం సుపరిపాలనవైపు వేగంగా ముందుకు వెళ్తోందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, మైనార్టీ నాయకులు మంత్రిని కలిసి అభినందించారు. ఫరూక్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి రూ.5,434 కోట్లు కేటాయించామని, గత ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేశామని తెలిపారు.
Updated Date - Jun 13 , 2025 | 04:11 AM